పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించారు. బాలకార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఆయన ద్వితీయ స్థానాన్ని సాధించారు. ఐఎస్ఓ గుర్తింపు పొందిన తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ, మరియు ఉషోదయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కవితల పోటీల్లో ఆయన ఈ అరుదైన ఘనత సాధించారు. మేనేజింగ్ డైరెక్టర్ డా.యు.వి.రత్నం, జాతీయ అధ్యక్షురాలు ధనాశి ఉషారాణి, కవితల పోటీల నిర్వాహకులు గుత్తావిల్లి శ్రీనివాసరావుల నేతృత్వంలో తిరుమలరావు పంపిన కవిత ఎంపికైంది. బాలికే జగతికి బంగారు భవిత అనే అంశంపై అంతర్జాలం ద్వారా నిర్వహించిన ఈ జాతీయ స్థాయి కవితల పోటీలకు వెలుగునిచ్చు దీపిక బాలిక అనే కవితను తిరుమలరావు పంపగా ఎంపిక కమిటీ సభ్యుల ప్రశంసలు అందుకుంది. స్వర్ణమంటి భరతావని ఏలికకు ప్రోత్సహించాలి బాలికకు అంటూ, చరిత్రలో స్పూర్తి నింపే మహిళామణులను బాలికలంతా ఆదర్శంగా తీసుకోవాలని తిరుమలరావు తన కవితలో రచించారు. ఈ మేరకు నిర్వాహకులు విజేత ప్రశంసాపత్రం, బహుమతిని పంపారు. తిరుమలరావుకు జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం లభించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
జాతీయ కవితల పోటీల్లో తిరుమలరావుకు ద్వితీయ బహుమతి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి