ప్రతి కణము మెదడు-కాలేదు.!!?: - డా ప్రతాప్ కౌటిళ్యా.
 మెదడు పని , పని కోసం పనిచేయడం కోసం పని చేయించుకోవడం కోసం. పని నాణ్యత లోపాలను సరిచేయడం కోసం మెదడు పని చేస్తుంది. అంటే విధుల నిర్వహణ కోసమే తప్ప ఎక్కువగా ఏ పని చేయటం కోసం మెదడు డిజైన్ చేయబడలేదు. చివరికణం వరకు విధులను బాధ్యతలను బాగోవులను చూడటమే దాని పని. ఎక్కువగా ఏ పని మెదడు చేయలేదు. అది దాని పని కాదు. మెదడు మేనేజర్ తప్ప యజమాని కాదు. మరి మెదడుకు ఆలోచించడం ఎలా వచ్చింది. తన పని తాను చేసుకుంటూ పోతుంది కానీ ముఖ్యంగా ఆహారము ప్రత్యుత్పత్తి రక్షణ ఉనికి కోసం మెదడు అదనపు బాధ్యత తీసుకున్నది. అంటే మెదడులో అదనపు విభాగాలు ఏర్పడ్డవి అందువల్ల ఇంటలిజెన్సీ పుట్టింది. అంతకన్నా ముందు మెదడు డిజైనింగ్ లో కేవలం విధి నిర్వహణ మాత్రమే ఉండేది. దానికోసం మరియు మెదడు సమన్వయం కోసం కమ్యూనికేషన్ సిస్టం ఏర్పడ్డది. అంటే మన పరిభాషలో చెప్పాలంటే స్పందించడం ప్రతిస్పందించడం లాంటిది. దాన్ని మనం మెదడులో ఏర్పడ్డ మొట్టమొదటి కాన్షియస్నెస్ అంటున్నాం. ఆ తర్వాత అదనపు బాధ్యతలు చేపట్టిన ఇంటలిజెన్సీ అనే విభాగం వలన కూడా మెదడుకు మరింత కమ్యూనికేట్ చేసే స్పేస్ ఏర్పడింది. దాన్ని రెండవ కాన్షియస్నెస్ అంటున్నాం. కమ్యూనికేషన్ అంటే రియాక్ట్ అవ్వడం రెస్పాండ్ అవ్వడం దాన్ని విస్తృత మెదడు కాంసియస్నెస్ అంటాం. ఈ రకంగా మెదడులో కాన్సెన్స్ ఏర్పడ్డది. అది మనిషిలో పర్సెప్షన్ వరకు ఎదిగింది. కానీ ఈ భూమి మీద జీవం పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు అంటే ఫిజికల్ కెమికల్ ఆర్గానిక్ అంతా సేమ్ టు సేమ్ జీవం పుట్టిన తర్వాత కూడా అదే పదార్థం అంతట కేవలం కాన్షియస్నెస్ తప్ప. 
కానీ బహుకణ జీవుల్లో అంటే మెదడు న్యూరాన్ సిస్టం లేని జీవుల్లో కూడా కణానికి పర్సెప్షన్ ఉంది. కానీ స్పందించడం ప్రతిస్పందించడం ఉంది అంటే కాన్షియస్నెస్ ఉంది. కాకపోతే మెదడు లేదు దాని డిజైనింగ్ లేదు. పర్సెప్షన్ లేదు. ఆ విషయం పరిణామం మరియు డిఎన్ఏ జన్యువులు సమాధానం చెబుతాయి. ఇప్పుడు మెదడు ఎందుకు ఏర్పడ్డది దాని విధులు ఏమిటి కాన్షియస్నెస్ ఎలా ఏర్పడ్డది ఎందుకు ఏర్పడ్డది మనకు అర్థమైందని భావిస్తున్నా. ఇంటలిజెన్సీ ఏర్పడ్డ తర్వాతనే కాన్షియస్నెస్ యంత్రాంగము ఏర్పడ్డది. ఇక్కడ కాన్షియస్నెస్ అంటే కేవలం కమ్యూనికేషన్ మాత్రమే దాన్ని వ్యక్తం చేసే పర్సెప్షన్ను కలిగి ఉన్నది మనిషి ఒక్కడే. జంతువులు చెట్లు మొక్కలు కణాలు దాన్ని చెప్పలేవు కానీ రియాక్ట్ అవుతాయి రెస్పాండ్ అవుతాయి కమ్యూనికేట్ చేస్తాయి కానీ వాటి వాటి స్థాయిలో సాంకేతికతతో మాత్రమే. కణం యజమాని డీఎన్ఏ మెదడు యజమాని కూడా డిఎన్ఏ కానీ కాన్షియస్నెస్ యజమాని మాత్రం కేవలం మెదడు మాత్రమే. ప్రతి కణంలో డిఎన్ఏ ఉంటుంది కానీ ప్రతి కణం లో మెదడు ఉండదు. అది అవసరం ఉన్నప్పుడు అంటే శరీరాన్ని కణాన్ని నడిపేందుకు విధుల నిర్వహణకు మాత్రమే మెదడు పుడుతుంది. దాని తర్వాత కాన్సియస్నెస్ పుడుతుంది. అంతేతప్ప ప్రతి కణం మెదడు కాలేదు. 
లండన్ ,

కెనడా సైంటిస్టులు ప్రతి కణం మెదడు అని ప్రతిపాదించిన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాసం రాయడం జరిగింది. 
డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శ్రీ శ్రీ కళావేదిక గౌరవాధ్యక్షుడు.
కామెంట్‌లు