సుప్రభాత కవిత : - బృంద
మబ్బుల ఇంటిని వదిలి 
ఇలకు జారిన నీటి చుక్కకు 
ఎన్ని ప్రేమ బంధాలో....
ఎంత మమతానురాగాలో...

వేగంగా భువిని తాకాలని 
కురిసే వాన చినుకుకు 
సాదర స్వాగతం పలికేందుకు 
గిరి శిఖరం చేతులు చాచగా.....

కౌగిట వాలిన బిందువులు 
కొండల బండల మీది నుండీ 
ఇరుకు త్రోవల వెంట సాగి 
లోయల దారుల జారుతూ..

తరువుల కుశలమునడిగి 
కొమ్మల ఊగే ఆకుల తడిపి 
రెమ్మరెమ్మను తలనిమిరి 
చెట్టుతో చేతులు కలిపి.....

అడవి తీగలకు అభ్యంగనమై 
విరిసిన పువ్వుల రేకులతో 
ముచ్చటగా ఊయలలూగి 
మొగ్గల బుగ్గన ముద్దు పెడుతూ...

కొత్త మెరుపులు కొమ్మకు అద్ది 
ఎండిన పాదుకు నిండుగా 
వేచిన వేరుకు అండగా 
వేసవి తాపము తీర్చగ వచ్చే 

వర్షానికి హర్షముతో 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు