ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలలను నిర్వహిస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తోందని, తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల పట్ల మోజువీడి తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జడ్పీహైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన పనివారికి నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలను కల్పించడమే కాకుండా అన్ని పాఠశాలలను ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తూ పాఠశాల పిల్లల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు ప్రైవేట్ బడుల్లో చేర్పించి వేలాది రూపాయలు వృధా చేసుకోవద్దని, ఉచితంగా నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లల్ని చదివించాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నందున ప్రధానోపాధ్యాయులు పాఠశాల గదులను, పరిసరాలను, మధ్యాహ్న భోజనం వండేవారు వంటగదులు, పాత్రలు, ఇతర సామాగ్రిని శుభ్రం చేసుకోవాలని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కోరారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం వండడంలో మెలకువలు, జాగ్రత్తలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మహేష్, శ్రీరాంపూర్, పెగడపల్లి, మల్యాల స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం పనివారు, సిఆర్పిలు చందర్, వి.వీరయ్య, కుంట కుమారస్వామి, చంద్రకళ, ఎం ఆర్ సి సి బంద్ సుంకరి జాలిగం రమేష్, తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులు ప్రైవేటు బడులపై మోజు వీడాలి: --- శ్రీరాంపూర్ ఎంఈఓ మహేష్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి