సుప్రభాత కవిత : - బృంద
దూరం అవక ముందే 
విలువ తెలుసుకోక పోతే 
చేయి జారిన క్షణాలు 
తిరిగి రావడం కష్టమే!

చేరువలో మౌనంతో 
దూరంగా జరిగితే 
చేరలేని  దూరాలను 
చేరుకోవడం అసాధ్యమే!

ఆహాలకు పోతే 
ఊహాల్లోనే సుఖాలు..
ఇహంలో శాంతి కోరితే 
సర్దుకుపోక తప్పదు!

తప్పు తెలుసుకుంటే 
ఒప్పుకోడానికి వెనుకాడితే 
ముప్పు ముంచిన తర్వాత 
తప్పుకోలేని తిప్పలే!

లేనివాటికై వగచి 
వెర్రిగా బాధపడితే 
ఉన్నవాటి విలువ 
మిన్న అని తెలియదు!

చీకటిలో మగ్గిపోయి 
బయటపడిన వారికే 
వేదన తీరే దారి కనపడి 
వేకువ విలువ తెలిసేది!

సుదూర విజయ కానుక గా 
సుగమ పథాల సూచికగా 
సువిశాల సువర్ణ జగతికి 
సుగతినివ్వ ఏతెంచు మిత్రునికి 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు