వాళ్లను చూడలేదు.!?: -డా ప్రతాప్ కౌటిళ్యా.
నేను ఇంతవరకు ఆడవాళ్లను చూడలేదు 
వాళ్లు నాకు ఎక్కడా కనబడలేదు. 
కానీ 
వాళ్ళ అవయవాలను చూశాను 
వాళ్ల శరీరాన్ని చూశాను 
వాళ్ల సంతానాన్ని చూశాను 
కానీ 
నేను ఇంతవరకు ఆడవాళ్లను చూడలేదు 
ప్రపంచం అంతటా మనుషులను మాత్రమే చూశాను. 

ఆకాశంలో ఎగిరే పక్షులను చూశాను 
పక్షుల్లా ఎగిరే మనుషులను చూశాను. 
ఇంతవరకు ఆడవాళ్లను చూడలేదు. 

అడవుల్లో పరిగెత్తే చిరుతలను చూశాను 
చిరుతల్లా పరిగెత్తే మనుషులను చూశాను 
ఆడవాళ్లను ఇంతవరకు చూడలేదు. 

సముద్రంలో ఈదే సొర చేపలను చూశాను 
సొర చేపల్లా ఈదే మనుషులను చూశాను 
ఆడవాళ్లను ఇంతవరకు చూడలేదు. నేను. 

తేనే ను కూడా పెట్టే తేనెటీగలను చూశాను 
తేనెటీగ ల్లాంటి మనుషులను చూశాను 
కానీ ఆడవాళ్లను ఇంతవరకు చూడలేదు. 

కన్న పిల్లలను కంటికి రెప్పలా చూసే
 కంగారు లాంటి జంతువులను చూశాను. 
కంగారు లాంటి మనుషులను చూశాను 
కానీ ఇంతవరకు ఆడవాళ్లను చూడలేదు. 

నిరంతరం శ్రమించే చీమలను చూశాను 
చీమ లాంటి మనుషులను చూశాను 
కానీ ఇంతవరకు ఆడవాళ్లను చూడలేదు.

భయంకరమైన క్రూర మృగాలను చూశాను 
పులులు లాంటి మనుషులను చూశాను 
కానీ ఆడవాళ్లను ఇంతవరకు చూడలేదు. 

చల్లని తెల్లని అందమైన గోవులను చూశాను 
గోవు లాంటి మనుషులను చూశాను 
కానీ ఆడవాళ్లను ఇంతవరకు చూడలేదు. 

భారీ శరీరాలను చూశాను 
ఏనుగు లాంటి మనుషులను చూశాను 
కానీ ఆడవాళ్లను ఇంతవరకు చూడలేదు. 

ఎత్తయిన ఒంటెలను చూశాను 
ఒంటెలాంటి మనుషులను చూశాను 
కానీ ఇంతవరకు ఆడవాళ్లను చూడలేదు.

సింహాసనం పై కూర్చున్న సింహాలను చూశాను 
సింహం లాంటి మనుషులను చూశాను 
కానీ ఆడవాళ్లను ఇంతవరకు చూడలేదు. 

నేను ఇంతవరకు ఆడవాళ్లను చూడలేదు 
వాళ్లు నాకు ఎక్కడా కనబడలేదు. 
ప్రపంచం అంతటా మనుషులను మాత్రమే చూశాను.!!?
==============================================
డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా శ్రీ శ్రీ కళావేదిక గౌరవాధ్యక్షుడు.

కామెంట్‌లు