రుతుపవనాల కోసం ఎదురుచూడడం.
రంగురాళ్లు అమ్ముకునే వారి దగ్గర
వజ్రం కోసం వెతకడం-వృధా.
బండరాళ్ల కోసం
గుండెలు పగిలేలా ఏడవడం
అందుల ముందు
అందం ప్రదర్శించడం-వృధా.
సింహాసనం వేసి
సింహాన్ని కూర్చోబెట్టడం
దాచి పెట్టిన అందాలను
అద్దం ముందు బయట పెట్టడం-వృధా
సముద్రాన్ని భూమిపై దాచిపెట్టడం
కఠిన శిలను కారుణ్యమూర్తిగా కొలవడం
అగ్నిగుండంలో
అఖండ దీపం వెలిగించడం-వృధా
ఎండిన మొద్దుపై చిగురు లాంటి
చిరునవ్వును పూయించడం
నక్షత్రాల కోసం పగలును కోల్పోవడం
వృధా.
కొయ్య బొమ్మలతో చేయి కలపటం
మైనం బొమ్మల మాయలో పడటం
రక్త మాంసాలు లేని అస్తిపంజరాన్ని
గాలితో నింపడం -వృధా!!!
===================================
డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శ్రీ శ్రీ కళావేదిక గౌరవాధ్యక్షుడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి