బడిగంట గణగణ మోగింది
చదువులమ్మా గొంతెత్తి పిలిచింది
బాలలంతా బిరబిరా రారండి!
ఆటపాటలతో పాటు
చదువుసంధ్యల నేర్చుకుందాము.
ప్రార్థనలతో మొదలుపెట్టి
ప్రతిజ్ఞలను ఎంచక్కా చేసేసి
వార్తలను చదివి, విజ్ఞానమందుకొని
పద్యాలు,ప్రశ్నలతో ఉత్తేజితులమవుదాము.
క్రమశిక్షణగా తరగతి గదుల ప్రవేశించి,
విషయపరిజ్ఞానమును పెంచుకుందాము
అభ్యాసాలు చేస్తూ,అవలీలగా
ముందుకెళ్దాం.
పఠన,పాఠనాలతో ప్రజ్ఞకు పదను పెట్టుకుంటూ,
ఆటపాటలతో సేదతీరుతూ,
పాఠశాల శుభ్రతకు స్వచ్ఛంగా పాటుపడుతూ,
మంచి గుణాలనెన్నింటినో అలవర్చుకుందాము.
అమ్మ,నాన్నల సంతోషపెడుతూ,
సోపతులతో సరదాగా సాగుదాము.
రారండి రారండి బాలబాలికలారా
బడికి వేళైనది.
బతుకు నేర్చుటకు,బాసటగా నిల్చుటకు,
బాధ్యతగా మెలుగుటకు బడికి వెళ్దాము.
నైతిక విలువలు,మానవ విలువలు
,కుటుంబ విలువల సంపదను
ఆర్జించుటకు నిత్యమూ శ్రమిద్దాము,
భావి మనదే అని చాటుదాము.
ప్రకృతి ప్రేమికులమై,పచ్చదనాన్ని పెంచి,
సమాజానికి సారథులమవుదాము.
ఆత్మవిశ్వాసాన్ని,దేశభక్తిని
మనసు నిండా నింపుకుందాము,
మువ్వన్నెల జెండా నీడలో,
నింగే హద్దుగా ఎదుగుదాము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి