ఓ బాలిక మేలుకో: - డా. ధనాశి ఉషారాణి -భాకరాపేట తిరుపతి జిల్లా

 బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం  
       సందర్భంగా కవిత

ఓ బాలిక జగతికి వెలుగు రేఖవే 
కష్టాలు కడలిలో నవ్వుల రాణివై
కోటి వెలుగులు పంచే వెలుగు జ్యోతివై
కోటి నవ్వులిచ్చు పున్నమి వెన్నెలై
నిండుచందమామ కాంతులును జిమ్ముతూ
కవ్వించే పరిమళంను కూర్చు జానవులే
అమ్మపిలువులోని కమ్మదనంతో కడుపు నింపి 
అమృత హస్తాలతో లాలించుతూనే 
భావి జగతికి తరగని పెన్నిదిగా నిలిచావు
కల్మషo లేని నిండు పున్నమి వెలుగువై
చదువులు కోవెల్లో ప్రతిభను చూపుతూ
బడానాయకుల కాసులు గాలానికి బలియై
సమాజములో వివక్ష ముల్లుకు విసిగిపోతూ
నిండుదనం నింపుకొని మెండుదనం తెచ్చేవు
 శతకోటి జయాలకు నిండు వెలుగువు
అందుకో మాజోహార్లును అందుకోవమ్మ
కామెంట్‌లు