ఉల్లిపాయ పొట్టుతో ఉమ: -డా. కందేపి రాణీప్రసాద్

 ‘‘ ఉల్లిపాయ చేసే మేలు తల్లి కూడా చేయదు’’ అని సామెత. ఉల్లిపాయ లేని కూరే లేదు. ఉల్లి చెయ్యి పెట్టందే కూరేలా తయారవుతుంది. అంటుంటారు. ఉల్లిపాయ రసం జుట్టు పెరగడానికి , చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది.  ఉల్లిపాయల శాస్త్రీయ నామం ‘‘ ఏలియం సీప’’ ఇది ‘‘లిలియేసి’’ కుటుంబానికి చెందిన మొక్క. ఉల్లిపాయలకు గాలి ధారాళంగా కావాలి. లేకపోతే కుళ్ళిపోతాయి. అలాగే బంగాళా దుంపల్ని, ఉల్లిపాయల్ని ఒక చోట ఉంచకూడదు.  బంగాళా దుంపల నుంచి వచ్చే తేమ, వాయువుల వలన త్వరగా చెడిపోయే అవకాశం ఉన్నది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఉల్లిపాయను సంస్కృతంలో ‘‘పలాండు’’ అనీ, హిందీలో‘‘ ప్యాజ్’’ అనీ అంటారు. ఉల్లిగడ్డ, ఉల్లిపాయ, ఎర్రగడ్డ అంటూ రకరకాలుగా పిలుస్తారు. ఎరుపు, తెలుపు రంగుల్లో కూడా ఉంటాయి. ఈ ఉల్లిపాయలకు 500ఏళ్ళ నాటి చరిత్ర ఉన్నది.  దీనిలో ‘‘గంధకం’’ ఎక్కువగా ఉంటుంది. అందువలననే ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. ఉల్లి కాడల్ని సైతం కూరల్లో వాడుకుంటారు.
ఇంతటి ఘనమైన ఉల్లిపాయతో అమ్మాయిని చేయకపోతే ఎలా! ఉల్లిపాయ చీర అంటుంటారు. అందుకే ఉల్లి పొట్టుతో లెహంగా కుట్టాను. ఎర్ర ఉల్లిపాయ పొట్టును వాడాను. రంగు బాగుండాలి కదా!అమ్మాయికి ఉల్లిపాయ తొక్కతో లెహంగా వేశాను. చూడండి. మా పాప ఎంత బాగుందో!
కామెంట్‌లు