సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -258:  ఆదిలోనే హంస పాదు
**
"గదేందో గని అవ్వా! ఏపని శేద్దామన్నా ముడివడట్లే. పతి దానికి ఏదోటి అడ్డొత్తే ఏం జేత్తడు ఆడు. ఒకటా రొండా? ఏలు బెట్టి పతిదాంట్లే ఎన్కడుగే. పతి దానికీ సుక్కెదురే."
"ఏంది శెల్లే!గంత రంది శేత్తున్నవ్. మన కిట్నయ్య ముచ్చెటినేనా? గీ నడ్మల ఏవేవో శేద్దామని ముందలేస్కుండంట గద. గయ్యి ముందట వడలేదా ఏంది?
 " అవునవ్వా! గాని ముచ్చెట్నే.  గానిష్యమే రంది వడ్తున్న రేతిర్లు నిద్దరుండట్లే పగటీలి తిండి తినబుద్ది గాట్లే పిలగాడి బత్కు ఇంగెప్పుడు కుదుర్కుంటది. పది రూపాయిలు ఆమ్దాని ఉంటెనే వొచ్చే సంవందం ఖాయమైతది. ఏం లేకుండా గీ ఎగసాయం ఉందంటే గీ దినాలల్ల ఎవలు ముందుకొత్తరు?"
" అవును శెల్లే! గీ కాలంల ఆర్నెల్లకి యాడాదికి పైసలొత్తయంటే నచ్చుడు లేదు.శేతుల పైసలు ఎట్లోగట్ల టికటిక లాడాలె. ఏదో ఓ పని గా దాంతో సుత శెయ్యాల్సిన దినాలొచ్చినయ్! కలికాలం శెల్లే ఏం జేత్తం లోకమిట్లుంది."
" అవునవ్వా! గదేం శిత్రమో గని  గీడేది మొదలు వెట్టినా ముందుకువోక గాన్నే ఆగుతుంది.యిశారిచ్చి యిశారిచ్చి నెత్తినొప్పి వత్తుంది."
"గదే శెల్లే! ఎన్కటోళ్ళు అన్నట్టు గీడేపని జేసినా "ఆదిలోనే హంస పాదు" వొతికే గక్కన్నే ఆగిపోతుందటవు. అవునా శెల్లె!"
 " నీ కడుపు సల్లగుండ. అవునవ్వా! ఏది మొదలు వెట్టినా ఎవలో శక్రం దిప్పి ఆపినట్టు ఆగుతుంది. గింతకీ అవ్వా! "ఆదిలోనే హంస పాదు" అంటేందవ్వా? సమజైతలే?"
 " గద శెల్లే! గా సామెత ఎన్క పేద్ద కతుంది. ఇంటనంటే శెప్త మరి."
 " గిస్మంటియి యినాలన్న,తెల్సుకోవాలె అన్న  నాకు మా యిట్టం అవ్వా!"
 " అయితె యినుకో మరి. ఎన్కట పెద్ద పెద్ద అయ్యోర్లు,వొయ్యిలు సద్విన పంతుల్లు,ఏమనస్మంటోళ్ళు అన్కోరాదు. గా సద్వుల పెద్దోళ్ళు కాయితం మీద,వొయ్యిల రాశేటపుడు ఒక్కోపాలి తప్పులు వొచ్చేయి. గయ్యీటిని గురుతు పెట్టుకొని సూపడానికి అంస పాదం ( అంటే గది కొంచెం బాతు కాలి లెక్కనే ఉంటది) అచ్చం అస్మంటి పాదం గురుతును తప్పు బొయ్యిన కాడ ఇంకు తోటి పెట్టేటోళ్ళు. గది సూత్తానికి కూడిక లెక్క గురుతొతికె సుత ఉంటది శెల్లే. "
ఇంగ గా రాసుడు పురాగ అయినంక తప్పు గురుతులున్న కాడ కింద గీత గొట్టి తప్పుకు ఒప్పు పదం రాసి పెట్టే టోళ్ళు. గిట్ల తప్పులు సరింగ జెయ్యడానికే గీ 'అంస పాదం గురుతు 'అక్కడ పెట్టేటోళ్ళు.
" గట్లనే సద్వుల యిషయంల మొదలు వెట్టినా, ఏదైనా శెయ్యడాని కి గిట్ల శివాంట మొదలు వెట్టినమో లేదో గట్ల ఏదో ఒకటి అడ్డొచ్చుడునో అయితే గిదేంది గిట్ల జర్గిందని మనియాది బడుకుంట'ఆదిల్నే అంస పాదు " లెక్క అయ్యింది అన్కునేటోళ్ళు."
 "గట్లని రంది జెయ్యకు శెల్లె. దెబ్బలు తాకిచ్చుకోకుండ సైకిల్ నేర్సుకోవడం అయితదా? తొవ్వల పొంటి దూరాలు వోతుంటే ముచ్చెమటలు పోత్తున్నయని ఆగుతమా? గందుకే  రందొద్దు." మూల్గగంగ మూల్గగంగ రోగం - తీయంగ తీయంగ రాగమని "ఊకెనే అండ్లే. గీడు సుత షురూ జేత్తే గదే అయితది శెల్లే? "
 " అవునా అవ్వా!"
 " మారె" ఆర్నూరైనా మన జెయ్యాల్శిన పయత్నం శెయ్యాలి.అస్సలాగొద్దు శెల్లే! ఆదిల ఏ పాదం అడ్డొచ్చిన ఊకునే ముచ్చెటినే లేదు. అంతా మంచే జరుగుద్ది మన కిట్నయ్యకి. నే శెప్తున్న గీ మాటే గానికి శెప్పు. లేకుంటే నా తానికి రమ్మను. నేనే శెప్త."
" అవ్వా! గింత దైర్నం ఇచ్చినవ్! ఆన్ని సుత పంపుత. వొత్త మల్ల! "
 గదండీ సంగతీ! " ఆదిలోనే హంస పాదు " అంటే గిదే మరి."

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం