అల్ల నేరేడు పండ్లు: - వరుకోలు లక్ష్మయ్య -తెలుగు భాషోపాధ్యాయులు-ZPHS బక్రిచెప్యాల-9704865816
అల్లనేరేడు పండ్లురా 
అందముగా మెరిసెనురా 
నల్లని ముత్యాలలాగ
నవ్వుతూ ఊగేనురా!
 
చెట్టుమీద గుత్తులుగా 
చూస్తే నోరూరునురా
గాలివీచి ఊగగా 
కింద పండ్లు రాలునురా!

గబా గబా ఏరుకొని 
జేబులల్లో నింపెదము
ఒక్కటొక్కటొక్కటి 
నోట్ల వేసుకొనెదము

తినిన కొలది మెండుగా 
పోషకాలు దండిగా
నోరంతా నల్లగా 
పండ్లుతినగ చూడరా!

అల్లానేరేడు పండ్లురా
ఆరోగ్యం పెంచురా 
రండి రండి పిల్లలు 
పండ్లనన్ని తిందాము 
పరుగులే పెడదాము.


కామెంట్‌లు