గురువే మన వెలుగురా
మంచి గుణము నేర్పురా
అక్షరాల దీపమై
అందరినీ నడుపురా!
అమ్మ లాగా ప్రేమించి
నాన్నలాగ దీవించి
మంచి మాటలన్నీ చెప్పి
మార్గము చూపించునురా!
పలకబట్టి రాయించును
పాఠములు చదివించును
తెలివితేటలను పెంచును
తేజమంత నింపును!
తప్పు చేస్తే మందలించి
తప్పును సరిదిద్దును
మన భవిత బాగుండాలని
మనసారా కోరును!!
గురువు మాట విందాము
గొప్పగాను ఎదుగుదాము
సమాజ గమనానికి
సాయపడుచు సాగుదాము!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి