పిల్లల్లారా రారండి
కలిసి గుంతలు తీద్దాము
విత్తనాలు తెచ్చెదము
అందులోన నాటెదము
రోజునీళ్లు పోసెదము
చిన్నగ మొక్కలు వచ్చెను
మాకు సంబుర మాయెను
ఆకులు మేకలు తినకుండా
ముళ్ల కంచెలు వేసెదము.
మొక్కలు కాస్త చెట్లయ్యాయి
చెట్లకు పువ్వులు పూశాయి
పూలు కాస్త కాయలయ్యెను
కాయలు కమ్మని పండ్లుగ మారెను
పిల్లల మంతా కలిశాము
పండ్లను మేము తిన్నాము
పండ్లు శక్తిని ఇవ్వగా
చక్కని చదువులు చదివాము
అమ్మా, నాన్నలు మెచ్చారు అందరు భేషని పొగిడారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి