పొద్దున్నే లేచెనురా
పేపర్ బాయ్ వచ్చెనురా
దినపత్రికలు తెచ్చెనురా
వాకిట్లో వేసెనురా!
గాలి వాన వచ్చినా
వెనుదిరిగి పోడురా
ఎండవేడి,చలికిని
ఎన్నడు చలియించడురా!
చిన్నవాడే అయినను
చక్కగా పనిచేయురా
పని యంటే జంకడు
పరుగును లంఘిస్తడు
వీధి వీధి తిరుగురా
పేపర్లను పంచురా
ప్రపంచ సంగతులను
పట్టుకొచ్చి ఇచ్చునురా
పేపర్ బాయ్ సేవలను
మెచ్చుకొనెదమందరము
ధన్యవాదములు చెప్పి
ధన్యులము అవ్వుదాము.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి