చెప్పుకోండి చూద్దాం!--2.: - గుర్రాల లక్ష్మారెడ్డి -సెల్.9491387977. కల్వకుర్తి నాగర్


1.ఎన్నో కన్నులు నాకున్నవి
 స్వరాలను అవి మేస్తున్నవి
  నా గానమే అతి మధురం
  పాడునులే ఇక మీ అధరం !

2. గుండ్రంగానే ఉంటా
       కదలకుండా కూకుంట
       రొట్టెలతోనే నా దోస్తీ
       రెట్టలతోనే నా కుస్తీ !

 3. గాలిలో ఎగురుతూ ఉంటా
     భూమిపైన దిగుతూ ఉంటా
     అందరు నాలోన ఎక్కేస్తారు
     దేశ విదేశాలిక  చుట్టే స్తారు !

4. నీళ్లతోనే నా యొక్క పంట
       మీకుండదులే ఇక ఏ తంట
       అన్నేసి నన్నేసి ఇక చూడు
       రుచులుంటాయ్ మీ తోడు !

5. గాలే ఇక నాకు ఆహారం
       మైదానంలో నా విహారం
       రెండే నాకున్నవి గిల్లలు
       ఆ గిల్లల నిండా పుల్లలు !

6. మీ కాళ్ళతో నన్ను తొక్కుతరు
       దుస్తులతోని ఎక్కుతరు
       బాగా దుస్తులు కుట్టేస్తా
       వేగా డబ్బులు పట్టిస్తా !

7. ఉన్నచోటనే నేను ఉంటా
       ఉట్టికి ఇక ఎగరలేనని అంటా
       చిత్రాలను ఇక చూపిస్తుంటా
       వార్తలు  మీకు వినిపిస్తుంటా

   8. పళ్ళను కలిగి ఉంటుంది
       నోరు అసలే ఇక లేదంటది
       చెక్కలతో చేస్తది అది దోస్తీ
        చెక్కలపొడియే దాని ఆస్తి !

   9. కన్ను ఒకటే దానికి ఉంది
       తల మాత్రమే తను లేదంది
       దారమే దానికి ఇక ఆధారం
       దుస్తులు కానేకావిక భారం !
 
  10. పచ్చ పచ్చని పెట్టలో ఉంటా
        మెచ్చేలా నేను విచ్చుకుంటా
        తెచ్చుకోనిక  మీరొస్తారంటా
        కచుక్కున నే గుచ్చుకుంటా!

జవాబులు
#######
1.) మురళి. 2).రొట్టెల పీట.
3). విమానం. 4) ఉప్పు.
5).. సైకిల్.    6). కుట్టు మిషన్.
7). టీవీ.   8). రంపం.
9). సూది.   10). మొగిలి పువ్వు.

కామెంట్‌లు