ప్రవాస పద్య పరిమళం - 46: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 నా ఇండియా పర్యటన - తీర్థ యాత్రల కవన హారం.
శ్రీమాత్రే నమః  - అష్టాదశ శక్తి పీఠ దేవి కొల్హాపూర్ మహాలక్ష్మి




శార్దూలము :

శ్రీ చక్రమ్మున అంబ బాయి ప్రభ తో చిద్రూపి గా  వెల్గగా 
ఆచంద్రార్కము నద్వితీయముగనై అష్టాదశాశక్తివై
శ్రీ చంద్రోజ్వల కాంతి పుంజముల రాశీభూత స్త్రీముర్తి వై
శ్రీ చక్రీ శ్రిత పాదపద్మములకున్ ప్రీతిన్ సదా మ్రొక్కెదన్

===
కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం చరిత్రలో, దుష్ట రాక్షసుడు కోల్హాసురుడిని సంహరించిన తర్వాత ఆ ప్రాంతానికి అతని పేరు వచ్చిందని, ఈ ఆలయ విగ్రహం చాళుక్యుల కాలం నాటిదని, ఇది శక్తి పీఠాలలో ఒకటిగా, తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనం కోల్హాపూర్ మహాలక్ష్మిని చూడకుండా అసంపూర్ణం అని నమ్ముతారు.  
ఇది 18 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ అమ్మవారి కళ్ళు పడినట్లు పురాణాలు చెబుతున్నాయి.
కొల్హాపూర్ లో అంబ బాయి గా పిలవ బడే  మహాలక్ష్మి,  గధ, ఖేటక (డాలు), నిమ్మకాయ, పాన పాత్రలను నాలుగు చేతులతో పట్టుకుని,  పాదాల వద్ద కూర్చున్న సింహముతో  మంగళకర రూపం తో ఉంటుంది.
- వెంకట్ కొత్తూర్  Ashburn VA  USA 
కామెంట్‌లు