(నడుస్తున్న విజ్ఞాన సర్వస్వాలు)
మన జన్మప్రదాతలు
మన తల్లితండ్రులు
మన బ్రతుకును, మన భవితను,
మన పురోభివృద్ధిని కాంక్షించేవారు
మనమెవరికైనా ఋణపడ్డామంటే
అది మనలను కన్నోళ్ళకే
వారే వారే మన ప్రత్యక్ష దైవాలు
పసి వయసులో మనం మారాము చేసినా
మనల్ని ఎంతో ముద్ధుచేసినోళ్ళు
బడిలో చేర్చి
బ్రతుక్కుదారిచూపినోళ్ళు
అనంత విశ్వాన్ని
అక్షరాల్లో చదవమన్నోళ్ళు
ముందు భవిష్యత్తుకు చదువు
సమయం ఆలంబనౌనని చెప్పినోళ్ళు
అమ్మ కడుపులో
అణువంతున్నమనల్ని
కనిపెంచి పెద్దచేసి
సమాజమనే సువిశాల విశ్వవిద్యాలయంలో చేర్చినోళ్ళు
లోకజ్ఞానం
లౌక్యం
సమానత్వం
మానవత్వం
జీవ కారుణ్యం
సమాదరణ వంటి
విశిష్ట గుణాలను
మనలోపాదుగొల్పినవారు
మన మూలవేరైనోళ్ళు
మన కష్టసుఖాలకు
ఆనందానుభూతులకు
గొడుగై నిలిచినోళ్ళు
వారే వారే మన తల్లితండ్రులు
నడుస్తున్న విజ్ఞాన సర్వస్వాలు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి