నీ సంకల్పానికి ఊపిరి
చంచలమైన మనసు
సంకల్పానికి అవరోధం
పర్వతారోహకుడిచూపు
కొండ కొమ్మున జెండాపాతడమే
పైకెక్కువాడు భూతలం వంకచూడడు
సంకల్పించుకోవడం అంటే
ఆషామాషీ వ్యవహారం కాదు
లక్ష్యంపై గురి నిత్యసాధన
సంకల్పసిద్ధికి ఆధారభూతాలు
నువ్వు వెళ్ళేదారిలో
రాళ్ళున్న ముళ్ళున్నా
ప్రయాణం ఆపొద్ధు
ఆ గమ్యం చేరేవరకు
నువ్వు సాధించిన విజయాలు
నీ స్వీయసంకల్పానికి నిదర్శనాలు
దృఢచిత్తం
ఆశావాదదృక్పథం
మనో వాంఛలను
సిద్ధింపచేయుఉపకరణాలు
నీ కలలు సాకారం కావాలన్నా
నీ అకుంఠిత దీక్షతత్పరతే
నీకు శ్రీరామరక్షై
విజయం నీకుచేరువచేస్తుంది
నేటి యువత భుజస్కంధాలపై
దేశభవిష్యత్తుంది
వారిసంకల్పశక్తే
చేతనత్వమై
సామాజికోద్ధరణకై
బాటలువేస్తుంది
దేశపౌరులుసంకల్పబలంతో
అన్నిరంగాల్లో సాధించిన
దేశ ప్రగతే అందుకు ప్రత్యక్షసాక్ష్యం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి