.వైద్యునిసేవ: - వరుకోలు లక్ష్మయ్య -తెలుగు భాషోపాధ్యాయులు-జిపఉపా:బక్రిచెప్యాల-9704865816.


తెల్లనికోటు ధరించును 
తీయని మాటలు పలుకును 
బాధల్లోన జనాలకు 
భరోసా దీపం వెలిగించును

జ్వరం వచ్చి ఆసుపత్రికి వస్తె జాలిగడాక్టరుచేయిచూచును 
మందులు ఇచ్చిధైర్యముజెప్పి మల్లెలనవ్వులుపూయించును 
 
పగలు రాత్రి తేడా లేక 
పనులు చేసే సేవ మూర్తి 
రోగుల కష్టం చూసినప్పుడే 
కరిగిపోవును తన హృదయం

రోగుల కన్నీరును తుడిచి 
చిరునవ్వులు వారిలో పూయించు
సూదిమందులుఇచ్చేటప్పుడు
క్షేమసమాచారము అడుగు

తల్లుల ఆరోగ్యముకాపాడి 
ఆనందాలవెలుగునింపును
పుట్టిన బిడ్డను చేతిలో పెట్టి
ప్రేమగ ఆశీర్వదిస్తాడు.

గాయపడిన రోగుల చూసి
కలవర మొందును డాక్టరుగారు 
సత్వరంబుగచికిత్స చేసి
ప్రాణదాతగ నిలిచిపోవును.

కామెంట్‌లు