అక్షరాల వాస్తవాలు ; - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

గడిచిపోయిన కాలము 
తరిగిపోయిన జీవితము 
తిరిగిరాదు  తిరిగిరాదు
చేసుకో సద్వినియోగము 

చేజారితే బంధాలు 
మేనులోని అందాలు 
అతుకుకొనుట బహు కష్టము 
అంతులేని అనర్ధము 

కష్టించని జీవితాలు 
చెడగొట్టే స్నేహాలు 
అభివృద్ధికి బహు దూరము 
ఆవరిస్తే బద్ధకము 

ప్రేమలేని హృదయాలు 
కాపులేని వృక్షాలు 
చూడంగా వ్యర్థమే
మేలు చేయని చేతులు 

కామెంట్‌లు