ఇట్టివారు శ్రీమంతులు : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

జీవితంలో సమస్యలు 
కావు కావు శాశ్వతము 
అందుకే భీతిల్లకు 
ఆనందం కోల్పోకు 

ధైర్యమే ఆభరణము 
బ్రతుకులోన శోభితము 
ఘనమైన విజయాలకు 
అతి ముఖ్యమైన ద్వారము 

చిన్ని చిన్ని కలతలకు 
చెందబోకు ఆందోళన 
వయసులోన పెద్దలకు 
చేయొద్దు అవహేళన 

సాహసమే శ్వాసగా 
దరహాసం ఆస్తిగా 
ఉన్నోళ్లు ఘనులు ఘనులు 
సమాజాన శ్రీమంతులు 

కామెంట్‌లు