పిల్లలు చిరు మల్లెలు : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

పిల్లల పలుకుల్లో 
తేనెధారలున్నవి 
వారి చిరు మనసుల్లో 
ప్రేమ నదులు ఉన్నవి 

బాలల తలపుల్లో 
దైవత్వము  ఉన్నది 
వారి ఘన నడతల్లో 
స్ఫూర్తి దాగున్నది 

చిన్నారుల నోటిలో 
సత్య సిరులు ఉన్నవి 
వారి చిన్న మోములో 
విరుల తావులున్నవి 

పిల్లల నవ్వుల్లో 
మల్లె సొగసులున్నవి 
ముద్దుల పెదవుల్లో 
నాట్యమాడు చున్నవి 

కామెంట్‌లు