గాలితో నింపాల్సిన అవసరం లేదు
నింపబడే ఉంటుంది.
ఖాళీ చేయడమే మన పని
నింపడం మన పని కాదు..!?
ప్రేమ
ఒక మహా పర్వతం
కానీ మంచు పర్వతం.
అది కఠిన శిలనే కానీ కరుగుతుంది.
కాంతిని
అడ్డుకునేది భూమి ఒక్కటే కాదు
మేఘం కూడా..!?
డబ్బు లేకపోతే
మనిషి
నాగుపాము అవుతాడు.
డబ్బు సంపాదిస్తే
మనిషి
పెద్ద పాము అవుతాడు.
మరణం సులువే
కానీ డబ్బును సులువుగా
సంపాదించాలేం
ప్రాణం ఇస్తారు
కానీ డబ్బునివ్వరు.!!?
====================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి