సుప్రభాత కవిత : - బృంద


ఋతువులు మారవచ్చు 
గతులు మారవచ్చు 
స్థితులు కూడా మారవచ్చు 
వేకువా మారదు వెలుగులు మారవు 

గడచినది మరలి రాని 
గతమే నని అవగతమయ్యాక 
ఈనాటి ఈ క్షణం మాత్రమే 
నీ వద్ద వున్న నిజం!

రేపటిది  రానున్నది 
ఏమవుతుందో  తెలియని 
ఆరాటమే తప్ప వేరుకాదు 
ఈనాటి సమయమే నిజం!

ప్రతిరోజూ ప్రశ్నల మయం 
ప్రతి క్షణం పరీక్షా సమయం 
ప్రతిపేజీ చదవకనే గెలవాలనే 
ప్రయత్నం మాత్రమే నిజం!

అనుకున్నది జరగదు 
అందినది అసలే ఆనదు 
అందరినీ మాయలో ఉంచే 
అంతర్యామి అంతర్యమే సత్యం

రేపన్న ఆశ లేనిదే 
ఊపు లేదు ఏ బ్రతుకులో 
రేయి దాటిన తర్వాత వచ్చే 
వేకువేగా చేతిలోని పెన్నిధి!

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు