మనిషి చరిత్ర కూడా మొక్క చరిత్ర లాంటిదే!!: -డా ప్రతాప్ కౌటిళ్యా.
 

అది అడివే. అది వనమే అది తోటే అది ఊరే కానీ అడవిలో కేవలం ఒకే రకం కాదు వేరువేరు రకాల చెట్లు ఉంటాయి. వేరువేరు జాతులు ఉంటాయి. ఆడ మగ చెట్లు ఉంటాయి. 
అట్లాగే వనంలో తోటల్లో కూడా రకరకాల చెట్లు ఉంటాయి. పంటల్లో ఒకే రకం పండిస్తాం. తోటలో ఒకే రకం పండిస్తాం. కానీ ఊరిలో వనాల్లో మాత్రం రకరకాల చెట్లు ఉంటాయి. వాటికి వేరు వేరు జాతులు ఉంటాయి. 
వీటిలో ఏది గొప్పది వీటిలో ఏది నాణ్యమైనది వీటిలో ఏది తినడానికి పనికొస్తుంది. ఏది వైద్యానికి ఉపయోగపడుతుంది. ఏది మనకు జంతువులకు పనికొస్తాయి. ఏది డబ్బు సంపాదిస్తుంది అది మాత్రమే గొప్పది అది మాత్రమే విలువైనది. 
అట్లాగే కాయగూరల్లో పండ్లు కూరగాయల్లో కూడా ఏది విలువైనది. ఏది విలువ లేనిదో తెలుసుకుంటాం. అంటే చెట్లల్లో గంధం చెట్టు ఎర్రచందనం టేకు మరికొన్ని రకాలు గొప్పవి. అట్లాగే పొలాల్లో ఆపిల్ అరటి మామిడి బత్తాయి మొదలగునవి ముఖ్యమైనవి.
పూలల్లో గులాబీ చేమంతి మల్లెలు మొగలి ముఖ్యమైనవీ. కాయ కూరల్లో టమాటా వంకాయ ఆలు బెండ సొరకాయ ముఖ్యమైనవి. 
ఆకుకూరల్లో పాలకూర మెంతికూర లాంటివి ముఖ్యమైనవీ. అంటే అడవుల్లో వనాల్లో తోటల్లో పంటల్లో ఒకే రకమైనవి ఉండవు కానీ ఒకే రకాన్ని మాత్రం పెంచుకుంటాం. అది మనిషి పని వ్యవసాయం పని దాన్ని మనం వ్యాపారంగా మార్చుకున్నాం. కానీ నిజానికి అవి అన్ని అడవుల్లో వనాల్లో రకరకాలుగానే పెరిగాయి. రకరకాలుగాని మిగిలాయి. సరిగ్గా అట్లాగే సమాజంలో కూడా మనుషులు సమాజంలో రకరకాలుగానే ఉన్నారు. రకరకాలుగానే పెరిగారు. రకరకాలుగానే మిగిలారు. కానీ అడవుల్లోంచి వనాల్లోంచి రకరకాల మొక్కలను వేరుచేసి ఒకే రకం ఎన్నుకొని దాన్ని పంటగా పండిస్తామో అట్లాగే సమాజంలోని మనుషులు కూడా ఒక రకంగా ఒక జాతిగా ఒక తెగగా ఒక సమూహంగా పెరిగారు. 
సమాజం నుంచి సమూహ నుంచి విభజించబడ్డారు వేరువేరు జాతులుగా పెరిగారు. అంటే వాళ్లు ఒకే రకమైన పండగ పండించబడ్డారు. రకరకాల పంటలుగా మార్చబడ్డారు. రకరకాల విలువలతో పెరిగారు. అడవి నుంచి విడిపోయిన మొక్క విలువ ఎలా పెరిగిందో సమాజం నుంచి విడిపోయి పంటగా పండించబడ్డ పంట విలువ పెరిగింది తగ్గింది. 
సమాజంలోని మనుషులు కూడా మొక్కల్లా విడిపోయి వ్యక్తిగతంగా విలువలు పెంచుకున్నారు. మొక్కలు ఎలా ఆర్థికంగా విలువలు కలిగి ఉన్నాయో మనుషులు కూడా అలాగే వ్యక్తిగత విలువలు కలిగి ఉన్నారు. 
అంటే మనుషులు విడిపోయి విభజించబడి ఉన్నారు. వాళ్లు రకరకాలుగా జాతులుగా స్థాయిలుగా విడిపోయి ఉన్నారు. మనుషులు ఇప్పుడు కులం మతం ఆస్తి స్థాయి జ్ఞానం విజ్ఞానం మొదలగు విలువలతో విడివిడిగా ఏర్పడ్డాడు. ఇవన్నీ మొక్కల్లో అయితే ఆర్థికంగా ఉన్నతమైన వాటిని ఎన్నుకోబడ్డట్లు మనుషులు కూడా కేవలం ఆర్థికంగానే ఉన్నతమైన వారుగా ఉన్నప్పుడే ఒకే రకమైన పంటగా పండించబడుతున్నారు. ఆ పంట విలువను బట్టి ఆ మనిషి విలువ పెరుగుతుంది. కానీ మనిషికి మొక్కల్లా విస్తృత విలువలు కలిగి ఉండే అవకాశం దొరకలేదు. అందుకే జ్ఞానాన్ని కులాన్ని మతాన్ని దేవుని అధిగమించిన ఆర్థిక విలువల ఆధారంగానే మనిషి పంటలుగా పండించబడుతున్నాడు. ఆ విలువలు ఆధారంగానే ఆ రకమైన మనుషులకు ఆ సామాజిక విలువలు గౌరవం లభిస్తుంది. ఇదంతా అడవి నుంచి వనం నుంచి విడిపోయి ఒకే రకమైన వంటగా పండించబడ్డ మొక్కల చరిత్ర లాంటిదే మనిషి చరిత్ర కూడా. 
కులం మతం దేవుడు జ్ఞానం విజ్ఞానం లాంటి విలువలు కలిగిన మొక్క లాంటి వాడే మనిషి కూడా కానీ ఇక్కడ వ్యాపారంలో వీటి ద్వారానే డబ్బు సంపాదించడం ఒక విశేషం. కనుక మనిషికి మొక్కల కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి వాటి ద్వారానే మనిషి విలువ నిర్దేశించబడుతుంది. ఇదంతా ఒక వాణిజ్య పంట లాంటిదే. మనుషులు కూడా పంటల్లా పండించబడుతున్నారు. ఆర్థిక విలువలు ఆధారంగానే. 
పెద్ద తేడా ఏమీ లేదు. వ్యవసాయం లాంటిది మనిషి బ్రతుకూడా. మనిషి విలువలు కూడా మొక్క లాంటిది ఇది మన కర్తమైతే చాలు. మనిషి బ్రతుకు కూడా వ్యవసాయం లాంటిది పంట లాంటిది.. విలువైన పంటలనే పండిస్తున్నాం.
డా ప్రతాప్ కౌటిళ్యా 
విశ్రాంత అధ్యాపకులు.
కామెంట్‌లు