నీటికి ఆకారం లేదు
జలపాతానికి లోతు తెలియదు.
సింహానికి అడవి అడ్డురాదు.
అతడు ఒక యుద్ధం
అతడు ఒక స్వప్నం
అతడు ఒక ప్రయత్నం
అతడే ఒక సైన్యం-అతడు ఆర్డీవో హుస్సేన్..!!
చెమట చుక్కల్లో
ఒక ఇంద్రధనస్సు
కన్నీటి చుక్కల్లో
ఒక సూర్యుడు
నల్లటి మట్టిలో
ఒక మాణిక్యం
వెండి వెన్నెల్లో
ఒక చంద్రుడు
కర్షక లోకంలో
ఒక ఇంద్రుడు-అతడు
అతడు ఒక సింహ్మ స్వప్నం
అతడే ఆర్డిఓ హుస్సేన్.!¡!
అతడు ఒక సుడిగాలి
అతడు ఒక సుడిగుండం
అతడు ఒక అగ్నిపర్వతం
అతడు ఒక అగ్నిగుండం.
అవినీతి పరుల గుండెల్లో
ఒక పరుగు పందెం.
నీతి నిజాయితీకి
ఒక ఎగిరే జాతీయ జెండా.
పేదల పాలిట
నిటారుగా నిలబడ్డ ఒక కొండ
అతడే ఆర్డిఓ హుస్సేన్...!!!!.
సిల్వర్ జూబ్లీ కళాశాల తమ్ముడు కుప్పం ఆర్డీవో
గౌరవనీయులు శ్రీ హుస్సేన్ గారికి ప్రేమతో అభినందిస్తూ.
డా ప్రతాప్ కౌటిళ్యా
విశ్రాంత అధ్యాపకులు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి