హాలో పిల్లలూ! నేనీ రోజు డ్రైఫ్రూట్స్ తో ఆడ పిల్లను తయారు చేశాను. ఇందులో క్రాన్ బెర్రీలు, బాదం పప్పు, జీడిపప్పు, నల్ల ద్రాక్షలు ఉపయోగించాను. ముఖ్యంగా క్రాన్ బెర్రీ పండ్లను వాడాను. కాబట్టి వాటి గురించి వివరిస్తాను. క్రాన్ బెర్రీలు అమెరికా దేశపు ఆదిమ పండ్లు. చల్లని వాతావరణంలో ఎక్కువగా పెరుగుతాయి. చిన్న పొదల వలె, తీగ జాతివలె ఉంటాయి. ఇవి “ఎరికేసియే” కుటుంబానికి చెందినవి. వీటి శాస్త్రీయనామం “వాక్సీనియమ్ ఆక్సికోకస్”. సాధారణంగా క్రాన్ బెర్రీలు ఎరుపు రంగులో ఉంటాయి. నేనీ బొమ్మలో కూడా ఎరుపు వాటినే వాడాను. పచ్చిగా ఉన్నపుడు ఆకుపచ్చగా ఉంటాయి. కొన్ని క్రాన్ బెర్రీలు నారింజ రంగులో ఉంటాయి. ఉత్తర అమెరికాలో “వాక్సీనియమ్ మాక్రోకార్పస్” ను సాగు చేస్తారు. ప్రపంచ క్రాన్ బెర్రీల ఉత్పత్తిలో 97% అమెరికా, కెనడా మరియు చిలీ దేశాలు పంచుకుంటాయి. 1647 లో మిషినరీ జౌన్ ఇలియట్ దీనికి తొలి సారిగా ఆంగ్లంలో ‘క్రాన్ బెర్రీ’ అని పేరు పెట్టారు. కొంగమెడ, తల, ముక్కులను క్రాన్ బెర్రీ పువ్వులు పోలి ఉంటాయి. ఇవి చిత్తడి భూములలో చిన్న ఎర్రటి పండ్ల మొక్కల నుండి ఈ క్రాన్ బెర్రీలు వచ్చాయి. వీటికి సన్నటి తీగలాంటి కాండాలు, సతత హరిత ఆకులు ఉంటాయి. పువ్వులు ముదురు గులాబీ రంగులో వెనక్కు వంగిన రేకులను కలిగి ఉంటాయి. శైలి, కేసరాలు బహిర్గతమై కనిపిస్తాయి. తేనెటీగల ద్వారా పరపరాగ సంపర్కం జరుగుతుంది. దీని ఫలాలు ఆకుల కంటే పెద్దగా ఉంటాయి. పుల్లని రుచిని కలిగి ఉంటుంది. ఆహారం కోసం, రంగు కోసం ప్రాచీన కాలాల నుంచి వాడుతున్నారు.
ఎరుపు క్రాన్ బెర్రీలతో అమ్మాయి శరీరాన్ని తయారు చేశాను. బాదం పప్పుల పాంటు తొడిగాను. జీడి పప్పులు, బ్లాక్ రెసిన్స్ ను కలిపి షర్టు కుట్టాను. ఈ బొమ్మలో అమ్మాయి మోడరన్ డ్రెస్సులతో చూపించాను. జుట్టు కోసం బ్లాక్ రెసిన్స్ ఉపయోగించాను. జుట్టుకు పోనీ టెయిల్ వేశాను. జీడి పప్పు పెదవులు, కను బొమ్మలు చక్కగా అమిరాయి. బ్లాక్ రెసిన్స్ కళ్ళుగా బాగా సెట్ అయినాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి