మెదడులో నైపుణ్యం ఎలా ఏర్పడుతుంది...!?: - డా ప్రతాప్ కౌటిళ్యా.
 

విశ్వంలో కాంతి ఒక్కచోటి నుంచే రాదు. వేరు వేరు చోట్ల నుంచి వేర్వేరు సమయాల్లో లేదా ఒకే సమయంలో రావచ్చు. కానీ ఒక్కటి మాత్రమే మన ఉనికిలో ఉంటుంది. 
మెదడులో ఆలోచనలు కూడా అన్ని ఒకేసారి పుట్టవు. లేదా వేరు వేరు సమయాల్లో రావచ్చు కానీ ఒక్క ఆలోచన మాత్రమే తెరమీదకి వస్తుంది. 
సరిగ్గా నిద్రలో కలలు కూడా వేర్వేరు సమయాల్లో లేదా ఒకే సమయంలో రావచ్చు కానీ ఒకే ఒక్కటి మాత్రమే తెరమీదికి వస్తుంది. 
మనం చేసే పనులు కూడా వేరువేరుగా ఉండవచ్చు ఒకే సమయంలో లేదా వేరువేరు పనులు చేయవచ్చు కానీ మనం ఒకే సమయంలో ఒకే ఒక్క పనిని మాత్రమే చేస్తాం....!?
ఒకే సమయంలో పుట్టిన ఆలోచనలు అన్ని పనులు అన్ని ఒకేసారి తెర మీదికి రావు. వచ్చిన ఒకే ఒక్కటి మాత్రమే ఉనికిలో ఉంటుంది. దీన్నే మనం నైపుణ్యం అంటున్నాం. మెదడు దీన్ని అధిగమించలేకపోయింది. అందుకే అది అంత నిగూఢంగా ఎదిగింది. ఈ ఫ్యాక్ట్ లేదా ఈ ఫీట్ లేదా ఈ లోపం కనుక మెదడుకు లేకపోతే ఇంత ఇంటలిజెన్సీ- నైపుణ్యం మెదడుకు వచ్చి ఉండేది కాదు.
మెదడులో ఇంటలిజెన్సీ ఎదగడానికి ఇది ప్రధాన కారణం. అంతేకాదు ఈ లోపం ఇంటెలిజెన్సీకి గొప్ప అవకాశం ఇచ్చింది. 
రెండు లేక అంతకుమించి ఎక్కువ పనులు ఒకేసారి చేయలేము. చేస్తే అది యంత్రమైతుంది తప్ప మెదడు కాదు. అందువల్ల మనం ఒకేసారి ఒకే పనిని చేయగలగడం వలననే అంత నైపుణ్యం మన మెదడు కు వచ్చింది. దాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నంలోనే మెదడుకు అదనపు ఇంటలిజెన్సీ ఏర్పడిందని తెలుస్తుంది.....!!
డా ప్రతాప్ కౌటిళ్యా 
విశ్రాంత అధ్యాపకులు.
కామెంట్‌లు