హలో! పిల్లలూ! కూరగాయలమ్మాయి అనగానే కూరగాయలు అమ్మే అమ్మాయి వచ్చిందనుకున్నారా కాదు. మన ఫ్రిజ్‌లో ఉన్న కూరగాయలన్నీ కలసి అమ్మాయి అవతారమెత్తాయి. ఇందులో వంకాయలున్నాయి, గోరు చిక్కుడు కాయలున్నాయి, ఉల్లి పాయలున్నాయి, పచ్చి మిరపకాయలున్నాయి. ఇంకా ఆకులు, తొడిమలున్నాయి. పిల్లలూ! మీకు కొన్న కూరలు నచ్చవు కదా! మమ్మీ! నాకు వంకాయ వద్దు, నాకు సోరకాయ వద్దు అంటూ అమ్మతో చెబుతుంటారు కదా! అలా అనకూడదు. ఒక్కో కూరగాయలో ఒక్కో రకమైన పోషకాలు ఊటాయి. విటమిన్లు, మినరల్స్, శరీరానికి కావాలంటే అన్ని రకాల ఆహార పదార్థాలను తినాలి. మీలాంటి పిల్లల కోసమే నేను ఈ కూరగాయలమ్మాయిని సృష్టించాను.
పచ్చి మిరపకాయలతో ముఖాన్ని తయారు చేశాను. ఎప్పుడూ కోపంతో ఉంటుందేమో ! జట్టుకేమో గోరు చిక్కుడుకాయల్ని పెట్టాను. పిల్లకు కోపమన్నాను కదా ! చూశారా జుట్టెలా చెరిపేసుకుందో! ఉల్లిపాయ చెవులకు లోలాకులు చేయించాను. వంకాయల చేతులు పెట్టాను. ఉల్లిపాయను గుండ్రంగా కత్తిరించి లంగాకు పువ్వులు కుట్టాను. గోరు చిక్కుడు కాయలతో పొడవుగా కాడ కుట్టు కుట్టేశాను. కాళ్ళకు ఉల్లిపాయ బూట్లు తొడుక్కుంది అయ్యో! ఎంతందంగా ఉందో? నా చిట్టి తల్లి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి