పద్మశ్రీ.కొలకలూరు ఇనాక్ చే " కావ్యసుధ "కు ఘన సన్మానం
 

ఆచార్య పద్మశ్రీ డాక్టర్ కొలకలూరి ఇనాక్ 88వ జన్మదిన సందర్భంగా హైదరాబాదు హిమాయత్ నగర్ లోని శారద కల్చరల్ హాల్లో సంగీత సాహిత్య సాంస్కృతిక సమన్వయ సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ కవి కూకట్లపల్లి పోలయ్య, ఆదివారం కవి సమ్మేళనం నిర్వహించారు. ఆధ్యాత్మికవేత్త,కవి,వ్యాసరచయిత, భాగ్యనగర సాహితీ సమితి రచయితల సంఘ స్థాపక ప్రధాన కార్యదర్శి "కావ్యసుధ"  " కవిరాజు పుట్టినరోజు - కళామతల్లి మురిసింది " అనే  కవితా మకుటముతో కవనం వినిపించి ఆహుతులను అలరించారు. మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపకులు గనులశాఖ పూర్వ డైరెక్టర్ డాక్టర్ వి.డి. రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన సభలో ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ కులపతి ప్రొఫెసర్ కొలకలూరి మధు జ్యోతి, నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షుడు కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ, విమల సాహితీ సంస్థ అధ్యక్షులు డాక్టర్ జెల్ది విద్యాధర్ గార్ల సమక్షంలో ఆచార్య పద్మశ్రీ డాక్టర్ కొలకలూరి ఇనాక్ చేతుల మీదుగా 'కావ్యసుధ' ను శాలువా, కృతజ్ఞతాపూర్వక జ్ఞాపికతో తో ఘన సన్మానించారు పురాతన దేవాలయాల, ఆధునిక దేవాలయ చరిత్రలను అందిస్తున్న సాహితీవేత్త కావ్యసుధను సభలోని కవి మిత్రులు అభినందించారు. సుమారు 60 మంది కవులకు పైగా కవులు, కవయిత్రులు పాల్గొన్న ఈ సమ్మేళనం డా.జల్దీ విద్యాధర్ ఐ ఆర్ ఎన్   మాట్లాడుతూ... కొలకలూరు గారి సేవలను గుర్తించి భారతరత్న బిరుదు ప్రధానం చేయాలని ప్రతిపాదించారు. డాక్టర్ నాళేశ్వరం శంకర్ ప్రభృతులు పాల్గొన్న సభ, అనంతరం చక్కటి విందు భోజనంతో  ముగిసింది.
కామెంట్‌లు