హాలో ఫ్రెండ్స్, మధుమాలతి పూలతో అందమైన అమ్మాయిని సృష్టించాను చూస్తారా! మా బాబు వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీలో చాలా పువ్వుల మొక్కలు ఉంటాయి. నేను ఈ మధుమాలతి పూలను చూడగానే పాపాయిని చెయ్యాలనుకున్నాను. ఇది ‘కాంబ్రిటేసి’ కుటుంబానికి చెందిన మొక్క. ఈ పువ్వులు పూసినప్పుడు తెల్లగా ఉంటాయి. తరువాత గులాబీ రంగుకు మారతాయి. పూర్తిగా పరిపక్వత చెందినపుడు ఎరుపు రంగుకు చేరుకుంటాయి. ఇవి గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఇవి బాగా సువాసన కలిగి ఉంటాయి. పొడువైన తోకకు చివర చిన్నపువ్వు ఉంటుంది. అన్ని రకాల నేలల్లో పెరుగుతాయి. దీని శాస్త్రీయ నామం “క్విస్ క్వాలిస్ ఇండికా”. అలంకారం కోసం ఇళ్ళలో, ఉద్యాన వనాల్లో పెంచుకుంటారు. “రంగూన్ మల్లి, రంగూన్ క్రీపర్, కాంబ్రెటమ్ ఇండికమ్” అని కూడా పిలుస్తారు. ఈ పువ్వులు వైద్యరంగంలో పలు వ్యాధులకు చికిత్సగా పనికొస్తాయి. ఈ చెట్టులోని ప్రతి భాగం ఏదో ఒక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఈ పువ్వుల జన్మస్థలం ఆఫ్రికా అయినప్పటికీ చాలా దేశాలలో కనిపిస్తాయి.
మాధవి శరీరాన్నంతా మధుమాలతి పువ్వులతోనే తయారు చేశాను. జుట్టు, జడలు, జడలో పూలు కూడా ఎర్రని మధుమాలతీ పువ్వులే. కళ్ళు, ముక్కు, నోరు పెట్టాను. ఎంత భావాత్మకంగా కనిపిస్తుందో మాధవి ముఖం. మా బుజ్జి పాప అందాన్ని మీరూ తిలకించండి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి