హలో పిల్లలూ! ఆపిల్ ను తింటారు గానీ అమ్మాయిని సృష్టిస్తారా అనుకుంటున్నారా! మరీ మీరు ఆపిల్ పండ్లను ఇష్టంగా తినాలంటే ఏదో ఒక ఆకారంలో తయారు చెయ్యాలి కదా! అందుకే ఆపిల్ ను అమ్మాయిగా మార్చాను. మా ఎదురింటి వాళ్ళమ్మాయి పుట్టిన రోజుకు కానుకగా తయారుచేసి ఇచ్చాను. సరే! ఇంతకీ ఆపిల్ పండు గురించి తెలుసుకుందామా! దీనిని కాశ్మీర ఫలం, సిమ్లా పండు, సీమరేగి పండు అని రకరకాలుగా పిలుస్తారు. ఇవి వసంత కాలంలో పూసి చలి కాలంలో పండ్లను ఇస్తాయి. ఇవి ఆకురాల్చే చెట్లు. ఇవి పశ్చిమ ఆసియాకు చెందిన చెట్లు. దక్షిణ అమెరికాకూ యూరప్ కు పాకి అక్కడ కూడా పండ్లనిస్తున్నాయి. ఇవి "రోజేసి " కుటుంబానికి చెందిన చెట్లు. దీని శాస్త్రియనామం “మాలస్ డొమెస్టికా” (malus Domestica). ఇందులో 7500 రకాల జాతులున్నాయి. కాశ్మీర్ ను ఆపిల్ పండ్లకు ప్రసిద్ధిగా భావిస్తారు. కాశ్మీర్ లో ఆపిల్ చెట్లతో ఫోటో దిగలేకపోయాను. "రోజూ ఒక ఆపిల్ ను తింటే డాక్టరును చూడాల్సిన అవసరం రాదు" అని ఒక సామెత, అలాగే న్యూటన్ మహాశయుడు ఆపిల్ చెట్టు కింద కూర్చునే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగాన్నాడు. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 55 మిలియన్ టన్నులు ఆపిల్ ఉత్పత్తి అవతున్నాయి.
ఆపిల్ ను నిలువుగా పలుచటి ముక్కలుగా కోసినపుడు నాకు ఈ ఐడియా వచ్చింది. ఆపిల్ విత్తనాలనే కళ్ళుగా అమర్చాను. ఆపిల్ మధ్యలో ఉండే విత్తనాల రంధ్రాలె ముక్కుగా తయారయింది. ఆపిల్ పై తొక్కతోనే దొండపండు పెదవులను అమర్చాను. కళ్ళ, ముక్కు, నోరు ఎంత సహజంగా అమరాయో కదా! ఇక్కడ బాలిక కాదు కొద్దిగా వయసు పెరిగిన ఆమె వచ్చింది. ఏమైనా అందంలో తక్కువేమీ లేదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి