పిల్లల్ని ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఏవో సంధ్య, టీచర్ కుమార్
  -- ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను ఘనంగా సన్మానించిన పాఠశాల ఉపాధ్యాయ బృందం 
--

ఆదర్శంగా నిలిచిన మండల వ్యవసాయ అధికారిణి సంధ్య, టీచర్ బండారి కుమార్


 ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల్లో క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో పాటు వారిపై అత్యధిక శ్రద్ధ కనపరుస్తున్నామని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో 
 ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆయన ఉపాధ్యాయులతో కలిసి శ్రీరాంపూర్ మండల వ్యవసాయ అధికారిని తొట్ల (ముస్కే) సంధ్య, అంకంపల్లి పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పని చేస్తున్న బండారి కుమార్ లను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. వ్యవసాయ అధికారిని సంధ్య  తన కూతురు విహాన్సీ, బండారి కుమార్ తన ఇద్దరు కూతుళ్లు ఆధ్యా, రియాలను ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించి, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.  ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సకల సౌకర్యాలతో పాటు నాణ్యమైన, శాస్త్రీయమైన విద్యా విధానాలను అమలు చేస్తూ, అక్కడి ఉపాధ్యాయులు పిల్లల్ని అద్భుతంగా తయారు చేయడం గమనించిన వారు తమ పిల్లల్ని ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి వారు కృషి చేస్తున్నారు. వీరిద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఎందరికో ఆదర్శనీయులు. వీరిని గ్రామం, మండలం, జిల్లాలోని ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, పలువురు అభినందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ఇతరులకు వీరిద్దరూ ఆదర్శంగా  పిలవడం పట్ల వారు మిక్కిలి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ పంట చేను లాంటి ప్రభుత్వ పాఠశాలలను వదిలి తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు పిల్లల్ని పంపించడం ఘోరమైన విషయమన్నారు. నేతిబీరలో నెయ్యి ఉండనట్లే, ప్రైవేట్ పాఠశాలల్లో ఏమీ లేదని, 'దూరపు కొండలు నునుపు' అన్నట్లుగా తల్లిదండ్రులు అక్కడ ఏదో ఉందని భ్రమ పడుతున్నారన్నారు. చదువుతోపాటు అక్కడ కనీస సౌకర్యాలు కూడా సరిగా లేవని స్వయాన ఒక విద్యాశాఖ అధికారే చెబుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. పిల్లల్ని బాగా చదివించి, వారిని క్రమశిక్షణగా ఉంచుతూ అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు గాను ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రెండుసార్లు 'బెస్ట్ స్కూల్ అవార్డు' పొందిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు మండల వ్యవసాయ అధికారిణి సంధ్య, టీచర్ బండారి కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ,  ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, బండారి శంకర్,  పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం