చిల్డ్రన్ హాస్పిటల్ లో హెల్త్ ఛార్ట్ ప్రదర్శన
 

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా స్థానిక సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్ లో వ్యాధులకు సంబంధించిన చిత్ర ప్రదర్శన జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా DM&HO డా.. ఆల్ఫ్రెడ్ ఏంజెల్ గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రముఖ బాల సాహితీ వేత్త, సైన్స్ రచయిత్రి, చిత్ర కళాకారిణి డా.. కందేపి రాణీప్రసాద్ తను తయారు చేసిన చిత్రాలతో చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. వ్యాధులు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను కథలు, కవితలు, వ్యాసాలు, పొడుపుకథలు, నాటికలు అనేక ప్రక్రియలలో రచనలు చేశారు. నూట ఇరవై ఛార్టులను చిత్ర సహితంగా తయారుచేసి అందించారు. ముఖ్య అతిధి వాటిని సందర్శించి మాట్లాడుతూ “ఈ చిత్రాలు పిల్లల కోసం చాలా ఉపయోగపడతాయి. ఆసుపత్రికి వచ్చిన రోగులు వీటిని తెలుసుకుని సరైన సమయంలో డాక్టర్లను సంప్రదించాలన్నారు. చాలా క్రియేటివ్ రచనలు చేశారు. ఉపయోగించుకోవాలని సూచించారు. మరో ఆత్మీయ అతిథిగా DIO డా.. సంపత్ కుమార్ “ఈ చిత్రాలు ప్రజలకు బాగా ఉపయోగకరమనీ, వీటిని పుస్తకాలుగా ముద్రించమనీ” సలహా ఇచ్చారు. చిత్ర సృష్టికర్త డా.. కందేపి రాణీప్రసాద్ వైద్య ఆరోగ్య చిత్రాలు పిల్లలకు, తల్లులకు ఉపయోగపడేలా తయారు చేసి పది వరల్డ్ రికార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డా.. కందేపి ప్రసాదరావు, కె. సృజన్ సింధూర్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌లు