చక్కని మాట - చూడదగ్గ పూదోట: - ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ)- సారవకోట


చక్కని మాట - చూడదగ్గ పూదోట
వికసించాలి ఇంటింట, ప్రతిచోట

మాట మృదువుగా ఉండాలి.
మాట మధురంగా ఉండాలి.
మాట మనసును గెలవాలి.
మాట మనుషులను కలపాలి.

చక్కని మాట - చూడదగ్గ పూదోట
వికసించాలి ఇంటింట, ప్రతిచోట

మాట మనిషిని చేయాలి.
మాట మహిమ అవ్వాలి.
మాట హత్తుకునేలా పలకాలి..
మాట ఎత్తుకునేలా చూడాలి.
మాట తీసుకునేలా పిలవాలి..
మాట పెనవేసుకొనేలా నిలవాలి.

చక్కని మాట - చూడదగ్గ పూదోట
వికసించాలి ఇంటింట, ప్రతిచోట

మాట ఓదార్పు కావాలి.
మాట ఓర్పుగా ఉండాలి..
మాట మైమరపు నివ్వాలి.
మాట మైకం అవ్వాలి.
మాట మమేకం కావాలి..

చక్కని మాట - చూడదగ్గ పూదోట
వికసించాలి ఇంటింట, ప్రతిచోట

మాట మంత్రమవ్వాలి.
మాట మాటలాడాలి..
మాట మేలు చేయాలి.
మాట మదిలో నిలపాలి.

చక్కని మాట - చూడదగ్గ పూదోట
వికసించాలి ఇంటింట, ప్రతిచోట

మాట మమత  కావాలి..
మాట మనతో మెలగాలి.
మాట మహిలో నిలవాలి..

చక్కని మాట - చూడదగ్గ పూదోట
వికసించాలి ఇంటింట, ప్రతిచోట

కామెంట్‌లు