పక్షులు: పావురం : - ఇష్టపది: ఎం. వి. ఉమాదేవి


ఓహో పావురమా! ఒయారము లొలుకుమా! 
గోపురము గూటిలో కాపురము చేయుమా! 

తెలుపు నీలి రంగులు తెలిపేను నీ హొయలు! 
చుక్కలున్న గుడ్లను చక్కనివీ పిల్లలు! 

పావురముల టపాలు! పరిపాలన సవాలు!
వేవేల మైళ్ళను వేగముగ దాటుమా! 

చార్మినారు చెంతను చాలపావురాలవి!
ఉమ వ్రాయు గీతాలు! ఉత్తేజ భరితాలు!!
కామెంట్‌లు