పద్మశ్రీ అవార్డు గ్రహీత వన జీవిరామయ్య జయంతి : వెంకట్ , మొలక ప్రతినిధి
 నేటి విద్యార్థులకు వనజీవి రామయ్య స్ఫూర్తి 



వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం మంబాపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల బాలుర పాఠశాలలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ హరిత లెజెండ్ కీర్తిశేషులు దరిపల్లి (వనజీవి) రామయ్య జయంతి వేడుకలు
తాండూరు కవయిత్రి మొల్ల కళావేదిక, "మొలక" బాలల మాసపత్రిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పాఠశాల ఆవరణలో "మామిడి" మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ నిబద్ధతను చాటారు. అనంతరం వనజీవి రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. విద్యార్థులతో "వృక్షో రక్షతి రక్షితః – పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత" అనే ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తాండూర్ ప్రోగ్రెస్ స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ కీర్తి శర్మ మాట్లాడుతూ, బాల్య దశలోనే వనజీవి రామయ్య ప్రకృతి ప్రేమను, సేవాభావాన్ని ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కోటికి పైగా మొక్కలు నాటి భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నేల, పర్యావరణాన్ని అందించాలనే సంకల్పంతో దరిపల్లి రామయ్య, జానకమ్మ దంపతులు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
తాండూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి మాట్లాడుతూ, "వృక్షో రక్షతి రక్షితః" అనే సూక్తిని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులుKVM వెంకట్ 
మాట్లాడుతూ 
చదివింది ఐదో తరగతి అయినప్పటికీ 
తెలంగాణలో ఆరో తరగతి పాఠం లో వచ్చాడు 
మహారాష్ట్రలో పాఠ్యపుస్తకంలో ఆయన జీవితచరిత్ర చేర్చారు 
ఆయన జీవిత చరిత్ర ఆదర్శంగా తీసుకొని 
వేముగంటి డైరెక్షన్లో 
బ్రహ్మాజీ నాగరాణి 
వనజీవి జానకమ్మ వేషధారణలో" బయోపిక్"లఘు చిత్రం తీయడం 
జరిగిందని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో వనజీవి రామయ్య పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించారు. విజేతలకు "మొలక" బాలల మాసపత్రిక తరఫున బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కవయిత్రి మొల్ల కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కేవీఎం వెంకట్, పాఠశాల ప్రిన్సిపల్ పియూస్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం వనజీవి రామయ్య ఆశయాలను విద్యార్థుల్లో నాటేలా స్ఫూర్తిదాయకంగా సాగింది.
కె. వేణుగోపాల చారి
తెలుగు
రాములు
ఇంగ్లీష్
శంకర్
ఇంగ్లీష్
వెంకట్ దాస్
బయాలజికల్ సైన్స్
తిరుమలేష్
ఫిజిక్స్
అనిల్ కుమార్
సాయిల్ (Soil)
విజయ లక్ష్మి
స్టాఫ్ నర్స్
లలిత
కామెంట్‌లు