అదెవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి అనే పాఠ్యాంశ గీతిక దృశ్య కావ్యాన్ని వీరఘట్టం మండల విద్యాశాఖాధికారి దనుకొండ గౌరునాయుడు ఆవిష్కరించారు. మండల విద్యాశాఖాధికారి రాగోలు ఆనందరావుకు తొలి ప్రతిని అందజేశారు. స్థానిక ఎం.ఆర్.సి. కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. బాలబాలికలలో చదువుల పట్ల మిక్కిలి ఆసక్తి పెంచేలా ఇలాంటి దృశ్యమాలికలు దోహద పడతాయని విద్యాశాఖాధికారులు ఇరువురూ హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా రూపకర్త బి.ఎం.గౌరీశ్వరరావును వారు అభినందించారు. ఇప్పటికే గౌరీశ్వరరావు, తాను నెలకొల్పిన కృషి ఆర్ట్స్ ఛానెల్ ద్వారా ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకూ గల తెలుగు పాఠ్య పుస్తకాలలోని పలు పాఠాలకు పాటలను స్వరపర్చి ఎ.ఐ. ద్వారా సంగీతాన్ని సమాకూర్చడం జరిగింది. సాంకేతికతతో దృశ్య రూపాన్ని అందించి, అవి పాఠ్యాంశాల బోధనలో విద్యార్థులకు అవగాహన పెంపొందించుటలో కీలక పాత్ర పోషించారు. సినిమా పాటల ప్రభావం విపరీతంగా ఉండి పిల్లల వైఖరులను పక్క తోవ పట్టిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో ఇలా సంగీత సృష్టిలో సినిమా స్థాయితో సమానంగా స్వరాలు, రాగాలు, సంగీతం, మంచి సాహిత్యాన్ని, గొప్ప కవుల రచనలను పసిపిల్లల హృదయాలకు వినిపించటం సంతోషకరమని సంగీత అభిమాని, గాయకులు సి.హెచ్.తిరుపతిరావు, కుదమ తిరుమలరావులు అభిప్రాయ పడ్డారు. ఈ తెలుగుతల్లి పాఠం మూడో తరగతి తెలుగు పాఠమని, మహాకవి శ్రీశ్రీ రచనయని, ఆ పాఠాన్నే దృశ్య కావ్యంగా తీర్చిదిద్దానని బి.ఎం.గౌరీశ్వరరావు తెలుపుతూ 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ గల తెలుగు పాఠ్యంశాలు గా ఉన్న అన్ని గేయాలను ఇలా స్వరపర్చి దృశ్యకరణ చేయటం తన లక్ష్యమని తెలిపారు. ఈ వీడియోలో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు, ఉపాధ్యాయులు కనుగుల మోహనరావు, ఎల్.గణేష్, వై.సతీష్, ఎం.రామినాయుడు, డి.శ్రీనివాసరావు, చల్లా తిరుపతిరావులు అభినయించారు. ఈ కార్యక్రమంలో వి.అన్నాజీరావు, ఎ.శ్రీహరి నాయుడు, అంపోలు సూర్యనారాయణ, జిల్లా రీసోర్స్ పర్సన్ ఆర్.ధనుంజయ నాయుడు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత వారాడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
తెలుగుతల్లి పాఠ్యాంశ దృశ్యకావ్యం ఆవిష్కరణ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి