ముద్దుల చిన్నారులు
అమ్మ నాన్నకిద్దరు
బంగారు పిల్లలు
గుండ్రని ముఖాల వారు
గులాబీల పువ్వులు
చిలిపి చిలిపి మాటలు
ముత్యాల మూటలు
వారు ఆడే ఆటలు
పరువాల బాటలు
బూరెలలాంటి బుగ్గల జంట
చూసినవారికి పండుగంట
చిన్ని చిన్ని అడుగులు
ఆనందపు వెలుగులు
బోసినోటి మాటలు
పలుకుటే సింగారం
వారు చేసెఅల్లరంటే
అమ్మకెంతో ఆనందం
మంచి నడవడికంటే
నాన్నకెంతో ఇష్టం
మాటలు మధురవనం
నవ్వితే పూలవనం
అమ్మ పిలుపే బంగారం
నాన్న పిలుపే సింగారం
ఇద్దరు నవ్వితేచాలు
ఇంద్రధనస్సు తలపించు
అభిజ్ఞ తెలివైనది
హయగ్రీవ ధైర్యశాలి!
ఇద్దరు కలిసి ఉంటే ఇల్లు
నందనవనమై విలసిల్లు
ఆటపాటలందరికి
ఆనంద గానము
చదువులో ముందు ఉండాలి
పెద్దల మాటలు వినాలి
మంచి పేరు తేవాలి
అమ్మ నాన్న మురువాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి