వ్యాస ప్రస్థానంలో...: - డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871


అనుకోలేదు కవితాప్రస్థానం నాలో
ఓ చిరుచెట్టులా దృశ్యాదృశ్య వెలుగునీడల డొంక ఆవల ఎదుగుతున్నదని... 

మట్టిలో విత్తనం
కడపులో శిశువు
తెలెత్తుకుని తల అక్షరకనుల లోకం చూపు పలకరిస్తుందని... 

కలగనలేదు 
సూర్యోదయమైన కళ నన్ను కవిగా భావోద్వేగాల చిత్రిక పడుతుందని...

నడుస్తూ నడుస్తూ 
నాలుగు దశాబ్దాలు 
రోగి నాడిని పరీక్షించిన జీవకళ
కలం కరచాలన కవిత్వం అల్లుతున్నదని...
 
లోపలి సంతోషం నదిని తలపిస్తుందని...
ఒకరు వ్యాసం రాయమని,కథ చూడండని మరొకరు, అనువాదం చెయ్యాలని మరో శక్తి ముందుకు నడిపిస్తుందని
లిప్త మాత్రం కూడా కలగనలేదు

స్నేహమంటే లోపలి నిస్వార్థ తత్వమని చదువుకున్న నాలో
అనువాదం ఈవల ఆవల దునికే, ప్రవాహ ఆత్మను పట్టే
కథ ఆనలేదు చేతి వేళ్ళ సందులు దూరిన వికర్షణ అది
కొసమెరుపుగా మిత్రుల మంచి చెడుల కాంతి తిమిరాల యాదిలో

మిత్రశ్రీ మన డాక్టర్ గారేమిరాస్తున్నారనే ఓ అదృశ్య ప్రశ్న 
బీజగణితం లెక్కలా తగిలెనేమో
పసి పసిడికలల మనసుకు,మేధకు 
నీళ్ళు నమలని వ్యక్తావ్యక్త భాష
మాట్లాడిన కళాత్మ లోపలి జవాబు 
ఎంత సహజమో ఆ గొంతు పాట!
డాక్టర్ గారిప్పుడు "వ్యాస ప్రస్థానంలో "  
ఆ బదులు పలుకు మెరుపంటే మెరుపే!!

వాస్తవమే కదా!
గత ఇరువది నెలల అవిశ్రాంత సిరా శోధన పరిశోధన సాధన ఫలితం
దాదాపు ద్విశతక రచయితల వ్యాస పూర్ణిమ
వెన్నెల కురిసింది వ్యాస వాకిలిలో 

ఈ చిగురంత కలం చిరు వ్యాస కృషి సితారా
సాహిత్య భారతి మెడలో మెరిసే మెరుపుల హారమై ఇప్పుడు...

కామెంట్‌లు