బాలసాయితివేత్త శ్రీ గుర్రాల లక్ష్మారెడ్డికి ఘన సత్కారం
 

స్థానిక కల్వకుర్తి ప్రముఖ బాలసాహితీవేత్త అయిన శ్రీ గుర్రాల లక్ష్మారెడ్డి సహస్ర కవి, రచయిత గారిని శాంతా ట్రస్ట్ ఆధ్వర్యంలో జడ్పిహెచ్ఎస్ సిరసవాడలో నిర్వహించబోవు కథ కవిత సృజనాత్మక కార్వేశాలలో పాల్గొని వారి విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని, మా ఆహ్వానం మేరకు తప్పకుండా కార్యశాలకుఉపస్తియై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరగా, వారి కోరిక మేర శ్రీ గుర్రాల లక్ష్మారెడ్డి సహస్ర కవి, రచయిత గారు అట్టి కార్యశాలలో పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు కవిత కథలు ఎలా వ్రాయాలో, కథకు కావలసిన మూల వస్తువు ఎలా సేకరించాలో, ఆ విషయాన్ని కథ గా ఎలా మాలచాలో సవివరముగా వివరించారు.
ఈ సందర్భంగా కవి గారిని ఉడుత భక్తిగా ఒక వెయ్యి రూపాయలు నగదు పారితోషకంతో బాటు ఘనంగా శాలువా కప్పి సత్కరించారు. బిడ్డ
సత్కరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ తో పాటు, వారి అనుచర పాఠశాల సిబ్బందికి , కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ సేరి సత్యనారాయణ గారికి,తోటి కథ రచయిత అయినవహీద్ గారికి, స్థానిక ఎంఈఓ గారికి, ప్రముఖ కవియైన శ్రీ సీనయ్య గారికి, విద్యార్థిని విద్యార్థులకు తన యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసినారు.
కామెంట్‌లు