విజయవంతంగా ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవం సంబరాలు
 

తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  డా. యు. వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణి జాతీయ అధ్యక్షురాలు నిర్వహణలో ఒంగోలులో ఆదివారం ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవం  సంబరాలు మరియు కవి సమ్మేళనమును నిర్వహించడం జరిగింది ఆచార్య సహస్ర కిరణ తేజము పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం మరియు  సినీ సంగీత విభావరి కార్యక్రమంను ఒంగోలులోని  శ్రీ విజయ వారాహి మ్యూజికల్ స్టూడియోలో ఘనంగా  నిర్వహించారు. ముఖ్య అతిథులుగా   రిటైడ్ మండల విద్యాశాఖ  అధికారి శ్రీ  కె.వి ప్రసాద్ రావు   డా. టి. గుణశేఖర్  కెమిస్ట్రీ ప్రొఫెసర్ .. లింగంగుంట రవిబాబు మాజీ యస్ సి కార్పొరేషన్ డైరెక్టర్  కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. .పాల్గొన్న అందరికీ సర్టిఫికెట్  ఆచార్య సహస్ర కిరణ తేజము పురస్కారమును అవార్డును ప్రదానం చేయడము జరిగిందనీ నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో గాయని గాయకులు పసందైన సినిమా పాటలతో ప్రేక్షకుల్ని అలరించడం  జరిగింది.
కామెంట్‌లు