ఆంధ్రమాత: - వరలక్ష్మి యనమండ్ర


ఆంధ్రమాత గోంగూరర
ఆదమరచి నీవుతినరా
రకరకముల వంటలురా
రుచికరముగ ఉండురా

పచ్చడి సృష్టించు ఘనత 
పప్పుదేగ గొప్ప చరిత
పండుమిరప రుచే కదా 
పులుసు తినగ మమత

ఆహారము  ఆకు మనకు 
రకరకముల వంట కొరకు 
కాండమైతే నార కొరకు 
కాయలైతే గింజ కొరకు 

కాల్షియము పుష్కలం
ఇనుము కూడ లభ్యం
ఉంది పీచు పదార్థం
ఎ సి విటమిన్లు ఘనం

రేచీకటి నివారించు
రుగ్మతలను నిరోధించు 
తుమ్మ దగ్గులు తగ్గించు
ఔషధగణుములు పంచు

కామెంట్‌లు