వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
151. నిరంతరా (చతురక్క్షరీ)
152. నిష్కారణా (చతురక్క్షరీ)
నూట ఏభైరెండవ నామ మంత్రము:
ఓం నిష్కారణాయై నమః
అన్నటికీ తానే కారణమని, తనకు వేరే ఏ ఇతర కారణములు ఉండవు, అంటవు అని ప్రకటమైన పరాత్పరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "నిష్కారణా" అని కీర్తించారు. సృష్టి లోని జీవులచేత చేయబడుతున్న కారణములన్నిటికీ కారణమైన తల్లికి వందనము.
మనచేత చేయబడే అన్ని కారణములకు అధిష్ఠాన దేవతలు ఉంటారు. ఈ కారణ దేవతలు అందరికీ అధి దేవత, "పరమేశ్వరి" లేదా "పరమేశ్వరుడు". ఈ పరమేశ్వరియే అన్ని కారణాలకు మూలము. అందుకనే ఈ అమ్మకు వేరే కారణములు ఉండవు. ఈ పరమేశ్వరికి, తల్లి తండ్రులు లేరు, పుట్టుట, పెరుగుట, మరణము అనే స్థితులు లేవు. ఈ తల్లి పైన వేరెవరూ లేరు. కనుక, శ్రీమాత "నిష్కారణా" అయ్యింది.
సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం, అనే ఈ ఐదు పనుల నిర్వహణలో తనకు ఏ కారణములు లేకుండా ఇచ్ఛా జ్ఞానశక్తి స్వరూపిణిగా, అన్నిటికీ తానే కారణంగా కనిపిస్తూ ఉంటుంది. సమస్త చరాచర జగత్తు సృష్టించినా, తనకు అంటూ ఏ కారణమూ ఉండదు. ఈ తల్లి పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపిణి. తాను కొలువున్న సహస్రారానికి గాని, తను వాసం చేస్తున్న కదంబ వన సృష్టికి గానీ, "నిష్కారణా" అయిన కాత్యాయనికి ఏ కారణాలు ఉండవు.
ఈ చరాచర జగత్తులో జరుగుతున్న ప్రతీ చర్యకూ, శ్రీమాత ప్రేరణ వలననే జరుగుతోంది అనీ, కానీ జగన్మాత అయిన తనకు ఏ కారణములు ఉండవు అనీ తెలుసుకుని, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం నిష్కారణాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి