"అదృశ్య వీరుడు" జానపద నవల 2️⃣✅వ బాగం: ...నాగమణి రావులపాటి...
 


మహారాజు శివదత్తుడు మహారాణి సుదేష్ణ
రాకతో మంత్రి వర్యుడు, వచ్చారా మహా
రాజా ఆశీనులు కండి.రోజు రోజుకు మీరు
పడే వేదన చూసి మన రాజ పురోహితులు
సుసేనుల వారిని నేనే రప్పించాను. మీ
బాధకు తగిన సూచనకోసం శాస్త్రాన్ని
అవగతం చేస్తున్నారు మహాప్రభూ
అన్నాడు మంత్రి శేఖరుడు. భేష్ మంచి
పని చేసారు అమాత్యా. నాకంటే మీ మహా
రాణి గారే ఎక్కువ బాధతో కృంగి పోవు
చున్నారు. ఏదన్నా తరుణోపాయం చెప్పి
నాకు ఈరాజ్యానికి ఆనందం కలగ జేయండి
పండితోత్తమా అని అన్నాడు మహారాజు
శివదత్తుడు. చిత్తం ప్రభూ మీరంతలా
అడగాలా! అది నాబాద్యత. అన్నీ చూడగా
నాకు ఒక అవగాహన కలిగింది ప్రభూ.
మీ దంపతులిద్దరూ కాత్యాయనీ వ్రతం 
చేయండి. తప్పక మీకు సత్ సంతానం కలుగుతుంది. 
ఈవ్రతం ఎందరో చేసి వుత్తమ సంతానాన్ని  పొందారు.  కాత్యాయని అమ్మవారు
సాక్షాత్తూ ఆ జగదంబ స్వరూపం.
ఈవ్రతం చేసి అమ్మను వేడుకోండి .ఆ అమ్మ
అనుగ్రహం తప్పక లబిస్తుంది ప్రభూ అని
విన్నవించాడు సుసేనుడు. పండితుని
నోటివెంట వచ్ఛిన ఆపలుకులకు ఆరాజ
దంపతులు పండితోత్తమా! అటువంటి
బాగ్యం మాకు కలిగితే మీరుణం ఈజన్మ
లో తీర్చుకోలేనిది. మీకు నాశక్తి కొలది
సంతృప్తి గావిస్తాను అని అన్నాడు శివదత్తుడు.
 ఎంతమాట ప్రభూ మీఆనందం కంటే
మాకు కావలసినది ఏమున్నది. రేపే
మంచి ముహుర్త మున్నది. పూజకు
సమాయుక్తం కానీయండి దగ్గరుండి
జరిపిస్తాను.ఇక సెలవు ప్రభూ అని రాజ
పురోహితులవారు వెడలారు‌. మంత్రి వర్యుడు
విన్నారుగా ప్రభూ! ఇక మీరు నిస్చింతగా వుండండి అని మంత్రి వర్యులు కూడా నిష్క్రమించాడు. 
తెల్లవారగానే రాజపురోహితులు ఆరాజ
దంపతులతో యధావిధిగా కాత్యాయనీ
వ్రతం చేయించి, బ్రాహ్మణులకు తగిన
దక్షిణలు ఇప్పించి ,అన్న దానాలు వస్ర
దానాలు చేయించి, తృప్తులను కావించాడు.
అనుకున్నట్టుగానే అమ్మవారి దయవలన
సుదేష్ణ మహారాణి గర్బం ధరించి నవ
మాసాలు రాగానే పండంటి ఆడ బిడ్డకు
జన్మనిచ్చింది. సాక్షాత్తూ ఆజగన్మాతే
అవతరించిందా!!అన్నట్టు అందమైన చిరు
ధరహాసంతో, బంగారు మేని ఛాయతో,
చందమామ వంటి రూప లావణ్యంతో,
కళ కళ లాడుతూ ఆ అందాల భరిణ
ముద్దులు మూట గడుతూ వున్న ఆమెకు
పండితుడు సుసేనుడిని జాతకం చూడ
మన్నాడు మహారాజు శివదత్తుడు. ఆయన
జాతకాన్ని తిరగేసి అన్నీ బాగున్నాయి ప్రభూ.
అమ్మాయి జాతకం అంతా బాగానే వుంది.
కానీ? అని సాలోచనగా ఆగాడు .కానీ ఏమిటి
పండితోత్తమా! ఆగిపోయారే చెప్పండి
అని ఆతురతగా అడిగాడు శివదత్తుడు.
అమ్మాయికి పదహారోయేట గండమున్నది ప్రభూ ?,
తరువాత బాగం రేపే.(సశేషం)...
కామెంట్‌లు