: ముప్పు తెచ్చిన బద్ధకం : - బి. షర్లిన , 7 వ తరగతి , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మూడపల్లి. రాజన్న సిరిసిల్ల జిల్లా
 

 

రామాపురం అని గ్రామంలో సోము,రాము అన్నదమ్ములు ఉండేవారు. సోము కస్టపడి పనిచేసేవాడు.
రాము బద్దకస్తుడు ఇద్దరు కలిసి ఎడ్ల బండిమీద వేరే ప్రాంతానికి వెళ్లారు. అప్పుడువారి వద్ద ఉన్న నీళ్లు అయిపోయాయి.
 ఎద్దులకు లేవు వాళ్ళకి లేవు. వారు ఒక చోటున ఆపి నీళ్లు ఎక్కడున్నాయో చూశారు. సోము తో రాము అక్కడ నీళ్లు వస్తాయి వెళ్లి కొంచం తవ్వు చెలమలో నీళ్లువస్తాయి. నువు తీసుకురా. నేను ఎద్దుల్ని కాపలా కాస్తానుఅన్నాడు రాము.
సోము పోయాడు కానీ అతడు బద్ద కస్తుడు కొంచెం తవ్వి నీళ్లు వస్తలేవు అని చెప్పాడు.
అప్పుడు సోము వెళ్లి ఇంకొంచం తవ్వితే నీళ్లు వచ్చాయి. అప్పుడు సోము తాను నీళ్లు తాగి ఎద్దులకు తాగించి తిరిగివచ్చాడు.రాముకి మాత్రం నీళ్లు పోయలేదు.
 తనకు ఎందుకు నీళ్ళివ్వలేదు అని రాముని సోము అడుగుతే తవ్వమంటే కనీసం కూడా ప్రయత్నించక నీళ్లు రావడం లేదన్నావు కదా అందుకే నీకు నీళ్లు లేవని అన్నాడు సోము దాంతో రాము తన తప్పు తెలుసుకుని పనిలో చురుగ్గా ఉండడం నేర్చుకున్నాడు బద్ధకం వదిలాడు.
నీతి :బద్ధకం వల్ల ఇతరులకంటే ఎక్కువ మనకే నష్టం

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Super ra