మానస వీణ: - బూస అర్జున్- 8 వతరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కులాస్ పూర్-నిజామాబాద్
 

మది తలపుల మడి
హృది తపనల సుడి
ఎద సరదాల సడి
గుండె గులాబీల పుప్పొడి
తికమక వలయంలో సందడి
తిమిరంలో కాంతుల సడి
వీణల మ్రోతల సవ్వడి
విశాల సౌందర్య గడి
తరగని ఆలాపనల తడి
గంధపు పరిమళ పొడి
జాజిమల్లెల హార లడి 
కమనీయ రాగాల బడి
ముగ్ధ మనోహర చడి
లలిత లావణ్య సొంపుల మడి
కలల సౌదపు అంగడి
మనసే మనిషికి మంగళ సడి.

              
కామెంట్‌లు