కృతజ్ఞతలు చెప్పాలి! : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

అన్నం పెట్టిన ఇంటికి 
కన్నం వేయకూడదోయ్! 
జ్ఞానం పంచిన నోటికి 
మట్టి పెట్టకూడదోయ్! 

కన్న తల్లిదండ్రులను 
కష్టబెట్ట కూడదోయ్!
బుద్ధి చెప్పిన గురువులను 
మోసగించకూడదోయ్! 

మంచి చేసిన వారికి 
కృతజ్ఞతలు చెప్పాలోయ్!
దేవుడిచ్చిన వాటికి 
ప్రేమ చూపి బ్రతకాలోయ్!

వెన్నుపోటు పొడవరాదు 
నమ్మకముంచిన వారిని 
అపహాస్యం చేయరాదు 
వయసులోన పెద్దల్ని 

కామెంట్‌లు