తాతయ్య సూక్తుల సరాలు :- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

తప్పకుండా ఉంటుంది 
కష్టానికి ఫలితమే
చిత్త శుద్ధితో చేసిన 
యే పనియైన లాభమే 

బద్ధకాన్ని తరిమితే 
చురుకుదనం చూపితే 
ఎంతైనా ఉపయోగము 
మంచితనం చాటితే 

సజ్జనుల సహవాసమే 
సమకూర్చును కడు క్షేమము
పవిత్రమైన బంధమే 
జీవితాల్లో అందమే 

కాసింత మానవత్వము 
బ్రతుకులో దైవత్వము 
చాలా చాలా ముఖ్యము 
చక్కని మనస్తత్వము 

కామెంట్‌లు